పాపం.. జగన్ ముద్ర లేకుంటే.. నెక్స్ట్ సీఎస్ ఆమేనేనా? బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయారా?

Chakravarthi Kalyan

ఏపీ కొత్త చీప్ సెక్రటరీగా సాయిప్రసాద్ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరజ్ కుమార్ ప్రసాద్ పదవి కాలం ఈ నెలతో పూర్తి కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. సీనియర్ ఐఎఎస్ సాయి ప్రసాద్ పేరును ఖరారు చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సినియారిటీ జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో శ్రీలక్ష్మి ఉన్నారు.


మామూలుగా అయితే చంద్రబాబునాయుడు సీనియార్టీ ప్రకారం పదవులు ఇస్తారు. సొంత ఆసక్తి తక్కువగా పెట్టుకుంటారు. సమర్థత చూస్తారు. ఇప్పుడు సీనియార్టీలో ముందు ఉన్న శ్రీలక్ష్మిని చూస్తూ చూస్తూ సీఎస్ చేసే చాన్స్ లేదు. ఆమె బోకే ఇస్తేనే తీసుకునేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. అంత ఘోరంగా ఆమె పని తీరు ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి చేసిన నిర్వాకాలతో జైలుకెళ్లారు. ఆరోగ్యం కోల్పోయారు. కోలుకుని సర్వీసులోకి వచ్చి తెలంగాణ క్యాడర్ లో ఉన్నారు. మళ్లీ జగన్ గెలిచారని ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుని క్యాడర్ మార్చుకుని ఏపీకి వచ్చారు.


జగన్ చెప్పినట్లుగా అమరావతి విషయంలో ఘోరంగా వ్యవహరించారు. చివరికి జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు పోస్టింగ్ కూడా లేదు. చిన్నవయసులోనే ఐఏఎస్ అయిన ఆమె.. వైఎస్ నీడలో పడి వారు చెప్పిన అడ్డగోలు పనులు చేయకపోతే ఎక్కువ కాలం చీఫ్ సెక్రటరీగా ఉండే అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. అంతకు మించి ఆమె తన కెరీర్ లోనే కళంకిత ఆఫీసర్ గా ముద్రపడ్డారు. వ్యక్తిత్వ పరంగా.. ఇమేజ్ పరంగా…కెరీర్ పరంగా ఎంతో నష్టపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: