సంక్రాంతికి వెళ్తున్నారా.. ఆర్టీసీ గుడ్‌న్యూస్?
విజయవాడలోని నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున ప్రజలు విజయవాడకు చేరుకుంటున్నారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వెళ్లేవారు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులు సిద్ధం చేసిన అధికారులు డిమాండ్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ ఆర్టీసీ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.