రేవంత్‌ ఫారిన్‌ టూర్లు ఆపు.. పిల్లలకు దారి చూపు?

Chakravarthi Kalyan
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు ఆపి విద్యార్థుల సమస్యలపై దృష్టిసారించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న మీకు రూ.8 వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించేందుకు మనసు రావడం లేదా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2 లక్షల 75 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.8 వేల కోట్లు చెల్లించి  లక్షలాది మంది రోగులను, విద్యార్థులను ఆదుకోలేరా అని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.

పేదల ప్రాణాలంటే మీకెంత చులకన ఉందో, విద్యార్థుల భవిష్యత్తుపట్ల మీకెంత చిన్నచూపు తేటతెల్లమవుతోందంటున్న బీజేపీ నేతలు.. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల, పేదలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: