దావోస్ కోసం బిగ్ ప్లాన్ రెడీ చేసిన రేవంత్ రెడ్డి?
గత దావోస్ పర్యటనలో ఒప్పందాల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ఆకర్షిస్తోందన్నారు.
పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేయాలని సూచించారు. తొలి ఏడాదిలోనే ప్రభుత్వ పథకాలు, అభివద్ది రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.