అమరావతికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక చకచక పనులు?
నాలుగు మాసాల్లోగా లోన్ అగ్రిమెంట్ వ్యవహారాలను పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ ను హడ్కో అధికారులు కోరినట్టు తెలుస్తోంది. అంటే నాలుగు నెలల్లో ఈ డబ్బంతా అమరావతి కోసం ఖర్చు చేయాలన్న మాట. మరి ఆ రేంజ్ లో పనులు వేగం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఈ ఐదేళ్లలో చంద్రబాబు కనీస మాత్రం రాజధానినైనా నిర్మించకపోతే మాత్రం మళ్లీ వైసీపీ వస్తే రాజధాని ఇష్యూ మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే చంద్రబాబు ఇంకా స్పీడ్ గా పని చేయాలని అమరావతి ప్రజలు కోరుతున్నారు.