చంద్రబాబూ, పవన్ కల్యాణ్.. ఆ పని చేయండయ్యా.. వీహెచ్ విజ్ఞప్తి

Chakravarthi Kalyan
గతంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలులో దామోదరం సంజీవయ్య  స్మృతివనం కట్టిస్తామని 2 కోట్ల రూపాయలు కేటాయించినా... ఇప్పటి వరకు అతీగతీ లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తర్వాత ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి... సంజీవయ్య స్మృతి వనం కట్టించాలని సంజీవయ్య ట్రస్టీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాన్‌ను కోరుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ చెప్పారు.


అలాగే కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ తెలిపారు. అలాగే రాహుల్‌గాంధీకి ఒక న్యాయం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్ భగవత్‌కు ఇంకో న్యాయమా...? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆక్షేపించారు.


గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్‌షా,  ఫ్రీడమ్ ను అవమానించిన మోహన్‌భగవత్‌పై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేని తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ ఆరోపించారు. న్యాయ వ్యవస్థ అందరికి సమానమే కదా...? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 14న దామోదరం సంజీవయ్య పుట్టిన రోజు వేళ... ఆయన సమాధి దగ్గరకు రావాలని కోరుతున్నానని తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: