
తెలంగాణ రైతులకు తుమ్మల గుడ్ న్యూస్?
రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు సెమీ అర్బన్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని.. జూన్ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్‌పాం కర్మాగారం అందుబాటులోకి వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను, అనువైన ప్రాంతాల అధ్యయనం చేయాలన్నారు.
అలాగే ప్రగతి చూపని ఆయిల్‌పాం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే విశ్వతేజ ఆయిల్‌పాం కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.