ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఇలా.. షెడ్యూల్ ఏంటో తెలుసా?

frame ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఇలా.. షెడ్యూల్ ఏంటో తెలుసా?

Chakravarthi Kalyan
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24 తేదీ నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభలను  రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉద్దేశించి ప్రసంగించనున్నాయి. ఉదయం 9.30 గంటలకు రాజ్ భవన్ నుంచి బయల్దేరి 9.53 నిముషాలకు రాష్ట్ర గవర్నర్  అమరావతి చేరుకోనున్నారు.
 
అసెంబ్లీ గేటు వద్ద రాష్ట్ర గవర్నర్ అబ్జుల్ నజీర్ కు సీఎం చంద్రబాబు, మండలి చైర్మన్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర అధికారులు స్వాగతం పలకనున్నారు. ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉదయం 11.15 గంటలకు ప్రసంగం పూర్తి కాగానే  గవర్నర్ అబ్జుల్ నజీర్ రాజ్ భవన్ కు తిరిగి పయనమవుతారు. అయితే ఈ సమావేశాలకు వైసీపీ అయ్యే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More