
మార్చి వచ్చేసింది బాబోయ్.. ఎండలు దంచేస్తాయట?
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుంది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
ఎండలపై సమాచారం కోసం విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలు అందిస్తుందని.. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.