కాంగ్రెస్ కుల గణన ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటుందనే విమర్శలున్నాయి.. కుల గణనను చేపట్టి శాసనసభలో ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామంటున్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. మీరు ఏ కంపెనీని చూసిన ఏడాదిలో వచ్చిన లాభాలు, నష్టాలు లావాదేవీల చిట్టా ఉంటుంది. అలాంటప్పుడు 75 ఏళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ఏ కులం లెక్కలో ఎంతో తెలియకపోతే ఎలా? జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ లెక్కలు చేస్తున్నప్పుడు బీసీ లెక్కలు ఎందుకు చేయకూడదన్నారు.
మేం అందుకే జన గణనలో కుల గణన చేపట్టాలని శాసనసభలో తీర్మానం పెట్టామన్న రేవంత్ రెడ్డి.. వాళ్ల డిమాండ్ సరైనప్పుడు ఇవ్వడంలో తప్పేం ఉంది.. రిజర్వేషన్లు ఎందుకు ఆపాలి. మేం అందుకే రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందనేది మేం చెబుతున్నాం. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఎలాగైనా మేం రిజర్వేషన్లు ఇస్తాం.. మండల్ కమిషన్ 29 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.. మేం వాటిని ఇంకా పెంచాలనుకుంటున్నామని తేల్చి చెప్పారు.