
ఇవాళ టీటీడీ కీలక మీటింగ్.. ఆ నిర్ణయం తీసుకుంటారా?
అలాగే బడ్జెట్ తోపాటు 30 అంశాలపై ధర్మకర్తల మండలి చర్చించి తీర్మానాలు చేయనుంది. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్ లను వెనక్కు తీసుకొని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ పై కూడా చర్చిస్తారు.
దీనితో పాటు నిపుణుల కమిటీ సిఫార్సులకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలుపే అవకాశం ఉంది. వేసవి సెలవులు రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేయడం పై కూడా టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి కీలక నిర్ణయాలకు ఇవాళ ఆస్కారం ఉంది.