బ్రేకింగ్.. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం..?
ఈ రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణల పేషీలు ఉండటం గమనార్హం. ఈ ప్రాంతంలో రోజూ అధిక సంఖ్యలో సిబ్బంది, అధికారులు సంచరిస్తుంటారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కూడా బ్లాక్‌లో కొంతమంది ఉన్నట్లు సమాచారం, కానీ వెంటనే చేపట్టిన చర్యలతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై సచివాలయ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి.