సింధూర్: మళ్లీ పాక్ దాడులు.. అక్కడ బ్లాక్ అవుట్

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్, భారత్ పై మరోసారి దాడులు చేస్తోంది. భారత్ లోని జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాంబా సెక్టర్ లో కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో భారత్ సైన్యం సాంబా సెక్టర్ లోని డ్రోన్ లను కూల్చేస్తుంది. నేడు పాకిస్తాన్ మళ్లీ దాడులు మొదలు పెట్టడంతో భారత్ బ్లాక్ అవుట్ విధించింది. దాడులను అడ్డుకునేందుకు భారత్ ఆర్మీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. డ్రోన్ లను తిప్పికొడుతూ భారత్ ని సురక్షితంగా ఉంచుతోంది.

ఇక ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ పాకిస్థాన్, పీఓకేలో ఉగ్ర‌శిభిరాల‌పై మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాలతో పాటు పలు చోట్లలో మెరుపు దాడులు చేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. దీనికి తోడు భారత్ వెన్నంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేస్తుంది. అలాగే పాకిస్తాన్ డ్రోన్ లతో చేసే దాడులను భారత్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ చెక్ పెడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: