లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Edari Rama Krishna
ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల సానుకూలం సంకేతాలతో సెన్సెక్స్ దాదాపు  వంద పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 28,182 దగ్గర, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,7122దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 28,182 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో హిందాల్కో, భారత్ పెట్రోలియం, అదానీ పోర్ట్స్, టాటాపవర్, బోష్ లిమిటెడ్ షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, ఐడియా, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

అయితే ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు లభించిన మద్దతుతో బ్యాంక్‌ నిఫ్టీ 0.4 శాతం లాభపడింది. పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభాలతో ట్రేడవుతున్నాయి.  జూలైలో అంచనాలకు మించి ఉపాధి కల్పన జరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలు అందాయి.

హిందాల్కో, బీపీసీఎల్‌, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్, మారుతీ లాభాల్లో ఉండగా  ఐడియా 2 శాతం  నష్టపయింది. ఈ బాటలో అంబుజా సిమెంట్‌, భారతీ, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌  కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: