లెన్స్ కార్ట్ లో విప్రో చీఫ్ పెట్టుబడులు
' లెన్స్ కార్ట్ ' తెలియని వారు పెద్దగా ఉండరు. ఆన్ లైన్ వ్యాపారం లో పేరెన్నిక గన్న ఈ సంస్థ లో విప్రో అధినేత అజీం ప్రేం జీ భారీగా పెట్టుబడులు పెట్టారు , అది కూడా రహస్యంగా. ఈ విషయాన్ని ఆయన ఇన్వెస్ట్మెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంత మొత్తం అందులో ఆయన ఉంచారు అనేది మాత్రం చెప్పలేదు అవరు. ఆ సంస్థ ఉన్నత స్థితి కి విప్రో పెట్టుబడులు ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పింది. గడచిన జూన్ నెలలో లెన్స్ కార్ట్ రూ. 400 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రేమ్ జీ తమతో కలసి రావడం ఎంతో సంతోషకరమని లెన్స్ కార్ట్ ఫౌండర్ చీఫ్ పీయుష్ బన్సాల్ వెల్లడించారు. మరో ఐదేళ్లలో ఐపీఓకు వెళ్లాలన్న తమ ఆలోచనకు ప్రేమజ్ జీ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు వివరించారు. ఆన్ లైన్ వ్యాపారంతో పాటు ఆఫ్ లైన్ వ్యాపారంలోనూ రాణించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.