రిలయన్స్ జియో మొబైల్ నెట్వర్క్ నుంచి ఫ్రీ కాల్స్ సునామీ లాగ ఒస్తాయి అనీ, ఉచిత కాల్స్ కాబట్టి ఇక విపరీతంగా నెట్వర్క్ వాడుకలో ఉంటుంది అనీ ఆ రేంజ్ లో తాము కనెక్టింగ్ పాయింట్ లు ఇవ్వలేము అని తేల్చిన ఎయిర్టెల్ కి గట్టి సమాధానం ఇచ్చింది జియో. "రిలయన్స్ జియో నుంచి ఔట్ గోయింగ్ ట్రాఫిక్ ఒక్కో కస్టమర్ నుంచి గంటకు రెండు కాల్స్ మాత్రమే. అది కూడా పీక్ ట్రాఫిక్ సమయంలో. వీటి కనెక్టింగ్ కు భారీగా పాయింట్స్ అక్కర్లేదు. ఈ కాల్స్ కూడా ఒక్క ఎయిర్ టెల్ కు మాత్రమే వెళ్లడం లేదు. అన్ని టెల్కోలూ పంచుకుంటాయి. దీన్నే సునామీ అని అనడం సరికాదు" అని రిలయన్స్ జియో ఓ ప్రకటన వెలువరించింది. తమకి కావాలనే ఎయిర్టెల్ కనక్తింగ్ పాయింట్ లు ఇవ్వడం లేదు అనీ ప్రతీ 100 కాల్స్ లో డబ్భై ఐదు కాల్స్ కనక్ట్ అవ్వడం లేదు ఐ తెలిపింది జియో. ఈ పరిణామం జరిగిన కాసేపటికి పెను సంచలనం మొదలైంది. సంస్థలు జియో -ఎయిర్ సెల్ ఒక ఒప్పందానికి ఒచ్చాయి. దేశ టెలికాం రంగంలోనే అతిపెద్ద విలీనం జరిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్ సెల్ సంస్థలు ఒక్కటయ్యాయి. ఉమ్మడి సంస్థలో రిలయన్స్’, ‘ఎయిర్ సెల్’ కు 50 శాతం చొప్పున వాటా లభించనుంది.