అక్షయ తృతీయ..బంగారం కొనుగోలు బాగానే పెరిగే అవకాశం

Vamsi
ఏప్రిల్ 18వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఈ రోజు బంగారం కొనడం చాలామందికి ఆనవాయితీ. దీంతో ఆభరణాల కొనుగోలు భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.అక్షయ తృతీయ కారణంగా ఆభరణాల విక్రయాలు పెరిగే అవకాశానికి తోడు, పెళ్లిళ్లల సీజన్. దీంతో సుమారు 15 నుంచి 20 శాతం వరకు అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జ్యువెల్లరీ మార్కెట్లో పెళ్లికి సంబంధించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, అదే సమయంలో పెద్ద నగలకు డిమాండ్ కొంత తగ్గిందన్నారు.  మరో వైపు వేసవి కాలం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆభరణాల విక్రయాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ కౌన్సెల్ చైర్మన్ తెలిపారు.

 భారత దేశంలో  అక్షయ తృతీయ పురస్కరించుకొని మహిళలకు ఓ సెంటిమెంట్ ఉంటుందని..అందుకే చాలా వరకు తమ బడ్జెట్ లో బంగారం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని వ్యాపారులు అంటున్నారు. అక్షయ తృతీయ రోజు న బంగారం తీసుకుంటే..అష్టైశ్వర్యాలకు అధినేత్రి శ్రీమహాలక్ష్మీ. ఆమె అనుగ్రహం ఉంటుందని.. జీవితంలో ఏ లోటు ఉండదని భావిస్తారు మహిళలు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: