పోటీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో...వినియోగదారులను ఆకట్టుకోవడం, వారిని నిలపుకోవడం ఎంతో కష్టం. అదే సమయంలో వినియోగదారుల ఆకాంక్షలు సైతం మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. కిరాణా స్టోర్లను అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై యాడ్ చేస్తోంది . రిటైల్ స్ట్రాటజీలో భాగంగా కిరాణా స్టోర్లలోకి కూడా చొచ్చుకుని పోయేందుకు సిద్ధమవుతోంది.
అమెజాన్ఈజీ, ఐ హ్యావ్ స్పేస్, సర్వీస్ పార్టనర్ ప్రొగ్రామ్, వంటి పలు ప్రొగ్రామ్‌లతో కిరాణా స్టోర్లను చేరుకుంటున్నారు. ముందుగా అమెజాన్ స్మాల్ మొబైల్ ఫోన్ సెల్లర్స్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.వారిని తన ప్లాట్‌ఫామ్‌పై ఎన్రోల్ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత వీటిని ఫుడ్ నుంచి మెర్చండైజ్ వరకు విస్తరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం అమెజాన్ బెంగళూరుకు చెందిన స్టార్టప్ షాప్‌ఎక్స్ తో కూడా టైఅప్ అయింది. ఇది కిరాణాలను పెద్ద పెద్ద రిటైలర్లు, ఎఫ్ఎంసీజీ కంపెనీలతో డిజిటల్‌గా కనెక్ట్ చేస్తుంది.
ఇదిలాఉండగా, ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ ఏడాది మే నెలలోనే ఇలాంటి సేవలను పైలెట్ బేసిస్‌లో ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొబైల్ ఫోన్లను అమ్ముకునేందుకు వీలుగా తెలంగాణలో 800 మంది చిన్న దుకాణదారులతో జతకట్టింది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ ఇదే స్ట్రాటజీని ప్రకటించింది. తన కొత్త ఈ–కామర్స్ ఛానల్లో భాగంగా లక్ష కొద్దీ షాపులను చేరుకోవడమే తన లక్ష్యమని రిలయన్స్ చెప్పింది. సేమ్ టూ సేమ్ రిలయన్స్ లాగానే… అమెజాన్ కూడా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.