' జియో ' కు షాక్ ఇచ్చేలా ఎయిర్‌టెల్ Xstream plan... సూప‌ర్ ఆఫ‌ర్స్‌

VUYYURU SUBHASH
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు పోటీగా ఇండియాలో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సర్వీసుదారుల్లో ఒకటైన ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ Xstream Box, Xstream Stick సర్వీసును ఆఫర్ చేస్తోంది. జియోకు పోటీగానే ఈ ఆఫ‌ర్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. 


ఎయిర్ టెల్ Xstream ఫైబర్ ప్లాన్ నెలకు రూ.3,999 ప్లాన్ తో 1 జీబీపీఎస్‌ స్పీడ్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఎయిర్ టెల్ థ్యాంక్స్ బండెల్ బెనిఫెట్స్ పొందవచ్చు. ఇందులో 3 నెలల నెట్‌ఫ్లిక్స్ ఆఫ‌ర్ కూడా ఉంటుంది. యేడాది పాటు అమోజాన్ ఫ్రైమ్ వీడియోస్ చూసే ఆఫ‌ర్ కూడా ఉంటుంది.


Xstream ఫైబర్ వినియోగదారులు దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా Unlimited Landline కాల్స్  చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యూజ‌ర్లు తొలి ఆరు నెల‌ల వ‌ర‌కు 1000 GB డేటా పొందవచ్చు. అదే జియో ఫైబర్ సర్వీసులో 1జీబీపీఎస్‌ ప్లాన్ రూ.3,999లు చెల్లిస్తే 2500 GB డేటా ఆఫర్ చేస్తోంది.


ఎయిర్ టెల్ Xstream Fiber బ్రాడ్ బ్యాండ్ సర్వీస్‌ తొలుత హోం,  చిన్న వాణిజ్య సంస్థల కోసం మొత్తం 15 నగరాల్లో లాంచ్ చేస్తోంది. అందులో ప్రధాన నగరాలైన ఢిల్లీ, గుర్గాన్, ఫరీదాబాద్, నోయిడా, ఘాజియాబాద్, ముంబై, పుణె, బెంగళూరులో లాంచ్ చేస్తోంది. భ‌విష్య‌త్తులో ఈ ప్లాన్ మిగిలిన న‌గ‌రాల‌కు కూడా విస్త‌రిస్తారు.


ఎయిర్ టెల్ xstream ప్లాన్ ఆఫ‌ర్లు చూస్తే...
xstream 4K హైబ్రీడ్ బాక్సు ధర రూ.3,999. ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లకు డిస్కౌంట్ ధరతో అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే రూ.2,249లు చెల్లిస్తే చాలు. ఈ బాక్సు ద్వారా యేడాది పాటు కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉంటుంది. ఈ బాక్సు ద్వారా యూజర్లు 500 TV ఛానళ్లను ఈజీగా వీక్షించవచ్చు.


ఎయిర్ టెల్ Xstream స్టిక్‌ ప్లాన్ ఆఫ‌ర్లు చూస్తే...
ఎయిర్ టెల్ Xstream Stick ఫీచర్లు DTH యాక్సస్ తప్పించి Xstream Box మాదిరిగానే ఉంటాయి. OTT ప్లాట్ ఫాంలో నెట్‌ఫ్లిక్స్‌, అమోజాన్ ఫ్రైమ్ వీడియోస్‌, యూట్యూబ్‌లో వీడియోలు పొందాలి. ఎక్స్ స్ట్రీమ్ స్టిక్ ధర రూ.3, 999 ఉంటుంది.  మొదటి నెల ఉచితంగా పొందవచ్చు. యానివల్ సబ్‌స్క్రిప్ష‌న్ కింద యూజర్లు ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: