దేశంలో అతి పెద్దదైన, ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఉపయోగించే ఏటీఎం కార్డులను బట్టి రోజుకు 20,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఖాతాదారులు నగదును ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకోవచ్చు. 8 నుండి 10 వరకు ఉచిత లావాదేవీలను కస్టమర్లు ఏటీఎం నుండి నిర్వహించుకునే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది.
ఖాతాదారుడు ఒకవేళ ఉచిత లావాదేవీలు పూర్తయిన తరువాత కూడా లావాదేవీలను నిర్వహిస్తే అప్పుడు మాత్రం కొంత డబ్బును బ్యాంకు పెనాల్టీగా తీసుకుంటుంది. ఖాతాలో తగినంత డబ్బు లేని సమయంలో ఏటీఎం ఉపయోగించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నిస్తే కూడా ఎస్బీఐ పెనాల్టీ విధిస్తుందని తెలుస్తోంది. సాధారణంగా ఎస్బీఐ ఖాతాదారులు ఎక్కువగా ఎస్బీఐ క్లాసిక్ మరియు మేస్ట్రో కార్డులను ఉపయోగిస్తారు.
ఈ రెండు కార్డులను ఉపయోగించేవారు రోజుకు 20,000 రూపాయల వరకు ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఉపయోగించేవారు రోజుకు 40,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కార్డుతో ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ మై కార్డ్ ఉపయోగించేవారు రోజుకు 40,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎస్బీఐ ఎన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు ఉపయోగించి రోజుకు 40,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ సిల్వర్ ఇంటర్నేషనల్ కార్డ్ మరియు ఎస్బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ కార్డ్ ఉపయోగించి రోజుకు 40,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ కార్డ్ ఉపయోగించి రోజుకు 50,000 రూపాయల వరకు విత్ డ్రా చేయవచ్చు. ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఉన్న ఖాతాదారులు మాత్రం రోజుకు 1,00,000 రూపాయల వరకు ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకోవచ్చు.