సుకన్య సమృద్ది పథకం గురించి తెలుసా మీకు??

Suma Kallamadi
సుకన్య సమృద్ది పథకం గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతర సేవింగ్స్ స్కీమ్స్‌తో పోలిస్తే సుకన్య సమృద్ది పథకంలో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ది అకౌంట్‌పై 8.4 శాతం వడ్డీ ఇస్తుంది. ఇండియా పోస్ట్ కూడా సుకన్య సమృద్ది స్కీమ్ (SSY Account) అందుబాటులో మనకి లభిస్తుంది. పోస్టాఫీస్‌లు అందించే 9 రకాల సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒక ఒక మంచి స్కీమ్స్‌.


ఎస్ఎస్‌వై అకౌంట్‌ను ఆడ పిల్లల పేరుపై ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 10 ఏళ్లలోపు వారికే మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏడాదికి ఈ పథకంలో రూ.1,000 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. సుకన్య సమృద్ది ‌స్కీమ్‌పై వడ్డీ ప్రతి సంవత్సరం అకౌంట్‌కు జమవుతూ వస్తుంది. ఎస్ఎస్‌వై అకౌంట్‌పై పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సుకన్య సమృద్ది అకౌంట్ ద్వారా కలిగే  లాభాలు ఏమిటో తెలుసుకుందామా మరి...


 సుకన్య సమృద్ది అకౌంట్‌పై ఇప్పుడు 8.4 శాతం వడ్డీ వస్తోంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ అన్నింటిలోకెల్లా వడ్డీ ఎక్కువగా లభిస్తున్న రెండో పథకం ఇది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ రాబడి పొందొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కల వయసు 21 ఏళ్లు. అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి దీన్ని లెక్కలోకి తీసుకుంటారు. డబ్బులు ముందుగా కూడా తీసుకోవచ్చు. అమ్మాయి పెళ్లికి కొంత మొత్తాన్ని అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 


అకౌంట్ మెచ్యూరిటీ గడువు పూర్తి అయ్యిపోయిన తర్వాత  డబ్బులను అకౌంట్ హోల్డర్‌కు అందజేస్తారు. ఇక్కడ మెచ్యూరిటీ తర్వాత కూడా వడ్డీ రేటు లభిస్తుంది. అంటే అకౌంట్ క్లోజ్ చేయకుండా అలాగే కొనసాగిస్తే ఉన్న డబ్బులకు వడ్డీ వస్తూనే ఉంది. ఇతర స్కీమ్స్‌లో ఈ బెనిఫిట్ లేదు.  సుకన్య సమృద్ది అకౌంట్‌పై పన్ను ప్రయోజనాలు కూడా లభించుకో వచ్చు. ఇక  అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే సంవత్సరానికి కనీసం రూ.1000 డిపాజిట్ చేస్తూ వచ్చిన ఏటువంటి ఇబ్బంది ఉండదు. ఒక కుటుంబంలో ఇద్దరు కూతుళ్ల పైరుపై అకౌంట్ తెరవొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: