రైల్వే ప్రయాణికులకు శుభవార్త....

Suma Kallamadi
రైల్వే ప్రయాణిం ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. ట్రైన్ మిస్ అయితే టికెట్ డబ్బులు వెనక్కి పొందొ అవకాశం వస్తుంది. ఇండియన్ రైల్వేస్ ఇ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. అయితే కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 


కనెక్టింగ్ ట్రైన్ జర్నీ చేసే వారికి ఇది మాత్రమే ఇది  వర్తిస్తుంది అని నిబంధనలు పెట్టారు. ఎలా అనుకుంటున్నారా? మీరు ఒక ప్రాంతానికి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే అక్కడికి డైరెక్ట్ ట్రైన్ లేదు. మరో ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి. ఇలా రెండు ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు మొదటి ట్రైన్ లేట్ కావడం వల్ల రెండో ట్రైన్ మిస్ అయితే అప్పుడు మీ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు అధికారులు.


‘తొలి ట్రైన్ ఆలస్యంగా నడవడం వల్ల మీ సెకండ్ ట్రైన్ మిస్ అయ్యిందా? అయితే మీ టికెట్ డబ్బులను వెనక్కి పొందే అవకాశం మాత్రమే అని చెప్పాలి. ఐఆర్‌సీటీసీ కొత్ కార్యక్రమం ద్వారా ప్యాసింజర్లు వారి కనెక్టింగ్ ట్రైన్స్ పీఎన్ఆర్‌లను కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో రిఫండ్ వేగంగా సులభంగా లభిస్తుంది  అని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ వేదికగా తెలియచేయడం జరిగింది.


ఇంకా కొన్ని నిబంధలు కూడా ఉన్నాయి.. అవి ఏంటో చూద్దామా మరి... కనెక్టింగ్ ట్రైన్ జర్నీ బుకింగ్ కోసం రెండు పీఎన్ఆర్‌లలోనూ ప్యాసింజర్ పేరు ఒకేలా ఉండాలి. జెండర్, వయసు వంటి వాటిల్లో కూడా తేడా ఉండకూడదు. సెకండ్ ట్రైన్ మిస్ అయినప్పుడు రిఫండ్ మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ పోర్టల్ లేదా యాప్ ద్వారా పొందవచ్చు అని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలియచేసింది. ఆన్‌లైన్‌ టికెట్లతోపాటు ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌లోనూ ఈ విధానం అమలుకానుంది. మొదట ఎక్కిన రైలు ప్రయాణ ఛార్జీని మినహాయించి మిగిలిన దూరం డబ్బులను రైల్వేశాఖ తిరిగి చెల్లిస్తుంది అని తెలుస్తుంది. టెలిస్కోపిక్‌ లాభం లేకుండా.. రద్దు ఛార్జీలను మినహాయించకుండా పూర్తిగా రిఫండ్‌ చేయనున్నట్లు ద.మ రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలియచేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: