కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఆధార్ పాన్ ఇంటర్‌ఛేంజబిలిటీని ఆమోదం తెలిపింది . దీంతో ఇకపై పాన్ కార్డు అవసరం ఉన్న చోటు ఆధార్ నెంబర్ ఇస్తే చాలు అని తెలిపింది. దీంతో పాన్ కార్డు లేనివారికి బాగా ప్రయోజనం కలుగనుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇంటర్‌ఛేంజబిలిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పలు సందర్భాల్లో పాన్ కార్డు బదులు ఆధార్ కార్డు ఉపయోగిస్తే చాలు. బడ్జెట్ 2019 సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాన్- ఆధార్ ఇంటర్‌ఛేంజబిలిటీని ప్రతి పాదించడం జరిగింది.
తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త నిబంధనలు తెలిపింది. సీబీడీటీ కొత్త రూల్స్ నిబంధనలు చేయడంతో దాదాపు 100కు పైగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫామ్స్‌లో వీటికి సంబంధించిన మార్పులు చాల జరిగాయి. ఇప్పటి నుంచి ఎక్కడైనా పాన్ కార్డు అవసరమైతే.. ఒకవేళ అది లేకపోతే అప్పుడు పాన్ బదులు ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అని తెలుస్తుంది.
ఇక పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలంటే కచ్చితంగా పాన్ నెంబర్ అవసరం. అయితే ఇప్పుడు పాన్ కార్డు లేకున్నా ఆధార్ నెంబర్ ఇస్తే చాలు. ఆదాయపు పన్ను శాఖ మినహాయింపు ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే అప్పుడు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు కచ్చితంగా చేయించాలి. ఇప్పుడు పాన్ కార్డు లేనివారు ఆధార్ నెంబర్‌తో సులభంగానే ఐటీఆర్ దాఖలు కూడా చేసుకునే అవకాశం ఉంది.
మాములుగా ఐతే ఐటీఆర్‌కు మాత్రమే కాకుండా బ్యాంకుల్లో నిర్దేశిత మొత్తం దాటి ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయాలని పాన్ కార్డు నెంబర్ కచ్చితంగా ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ కూడా పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అని అధికారులు తెలిపుతున్నారు.