మార్కెట్‌లోకి అదిరిపోయే పాలసీ వచ్చేసింది...

Suma Kallamadi

ప్రస్తుత మార్కెట్‌ లో చాలా  రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వస్తున్నాయి. బీమా కంపెనీలు పోటీపడుతూ మరీ కొత్త కొత్త ప్లాన్‌లను ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నాయి. సాధారణ ప్రజలు లక్ష్యంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల వైపు ఎక్కువగా అడుగులు వేస్తు ఉన్నారు. ఇప్పుడు జ్వరాలకు కూడా పాలసీలు అందుబాటులోకి రావడం జరిగింది.

 

ఈ క్రమంలో ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మస్కిటో బైట్ ప్రొటెక్టర్ పాలసీ. ఈ పాలసీ తీసుకుంటే దోమకాటు వల్ల కలిగే అనారోగ్యానికి చికిత్స చేసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీకి ప్రీమియం కూడా తక్కువగానే అందుబాటులో ఉంది. దోమల వల్ల వైరస్‌, బ్యాక్టీరియా, ఇరత పరణజీవులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వీటి వల్ల అనారోగ్య సమస్యలు బాగా ఎదురు అవుతున్నాయి.

 

 ప్రతి ఏడాది  వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ ప్రకారం మలేరియా వల్లఅంతర్జాతీయంగా 4,00,000 మంది మృత్యువాత పడుతున్నారు. ఇది కూడా దోమల వల్ల వస్తుంది. ‘దోమల వల్ల అనారోగ్యం బారినపడే వారి సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. అందుకే అందుబాటు ధరలోనే ఆకర్షణీయ పాలసీని లాంచ్ చేశాం’ అని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ (ప్రొడక్ట్స్) పల్లవి రాయ్ తెలియచేయడం జరిగింది.

 

ఇక ఈ పాలసీ 18 నుంచి 65 ఏళ్లలోపు వారు ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండానే  తీసుకోవచ్చు. 91 రోజులు దాటిన పిల్లలకు కూడా ఈ పాలసీ అందుబాటులో వస్తుంది. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ఇప్పుడు ప్రతి ఒకరికి సాధారణం అయిపోయాయి. ఈ కారణం వల్ల పాలసీ తీసుకోవం ఉత్తమం. రూ.లక్ష వరకు బీమా మొత్తానికి పాలసీ పొందే అవకాశం ఉంది. కనీసం రూ.5,000 మొత్తానికి ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: