అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ ఎక్స్2 ప్రో విడుదల

Suma Kallamadi

రియల్ మీ నుంచి వస్తున్న మొదటి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ ఎక్స్2 ప్రో భారతమార్కెట్లోకి వచ్చేసింది. బుధవారం జరిగిన ఈవెంట్లో దీన్ని మనదేశంలో లాంచ్ చేశారు. భారతదేశంలో అత్యంత వేగంగా చార్జ్ అయ్యే స్మార్ట్ ఫోన్ గా దీన్ని రియల్ మీ ప్రకటించింది. మొదటి ఫ్లాగ్ షిప్ ఫోన్ కావడంతో ఎన్నో అదిరిపోయే ఫీచర్లను ఇందులో రియల్ మీ అందించింది. అంతేకాకుండా డిజైన్ పరంగా కూడా ప్రీమియం లుక్ కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.

 

రియల్ మీ ఎక్స్2 ప్రో ధర ..

రియల్ మీ ఎక్స్2 ప్రోలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 
1. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ధర రూ.29,999
2. 12 జీబీ ర్యామ్, 256 జీబీ, ధర రూ.33,999

 

వీటికి సంబంధించిన ఆన్ లైన్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. లూనార్ వైట్, నెఫ్ట్యూన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు చూద్దామా మరి....

 

1. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే 
2. ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యం గల శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్, 
3. 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ ను ఇందులో సెల్ఫీ కెమెరా 
4. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ,  కేవలం 35 నిమిషాల్లో పూర్తి చార్జ్ అవుతుంది 
5. డ్యూయల్ స్పీకర్ ఫీచర్.

 

 రెడ్ బ్రిక్, కాంక్రీట్ రంగుల్లో ఈ మాస్టర్ ఎడిషన్ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. జపాన్ కు చెందిన ప్రముఖ డిజైనర్ నాటో ఫుకసావా చేతుల మీదుగా ఈ ఫోన్ విడుదల అవ్వబోతుంది. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్ కార్ట్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రారంభం కానుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: