పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.... ఇలా 90 శాతం డబ్బులు విత్ డ్రా...?

Reddy P Rajasekhar

సాధారణంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా పీఎఫ్ డబ్బులను రిటైర్మెంట్ తరువాత తీసుకోవాలి. కానీ పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు ఈపీఎఫ్ ఖాతా నుండి కొన్ని సందర్భాలలో ముందుగానే డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా వేతనం పొందేవారు ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పీఎఫ్ ఉన్నవాళ్లకు ఉద్యోగి వేతనం నుండి ప్రతి నెల 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. 
 
కొన్ని షరతులకు అంగీకరించటం ద్వారా పీఎఫ్ డబ్బులను ముందుగానే విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి విత్ డ్రా చేసుకునే లిమిట్ మారుతూ ఉంటుంది. ఇంటి నిర్మాణం, ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, పిల్లల పెళ్లి, అనారోగ్యం మొదలైన అవసరాలకు రిటైర్మెంట్ కన్నా ముందుగానే పీఎఫ్ డబ్బులను తీసుకోవచ్చు. కానీ పీఎఫ్ డబ్బులను ఐదు సంవత్సారాల సర్వీస్ తరువాత తీసుకుంటే మంచిది. 
 
ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుంది. పీఎఫ్ విత్ డ్రా డబ్బులు అవసరం ప్రాతిపదికను బట్టి మారుతూ ఉంటాయి. పీఎఫ్ అకౌంట్ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునేవారు 24 నెలల బేసిక్ శాలరీ, డీఏలకు సమానమైన మొత్తాన్ని పొందవచ్చు. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు ఐదు సంవత్సరాలు కాంట్రిబ్యూషన్ కలిగిన ఉద్యోగి ఇంటి నిర్మాణం కొరకు లేదా ఫ్లాట్ కొనుగోలు కొరకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు. 
 
ఐదేళ్ల వరకు వేచి ఉండి ఆ తరువాత పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తే మంచిదని ఉద్యోగం మారే సమయంలో పీఎఫ్ ఖాతాను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: