నిమిషాల్లో పర్సనల్ లోన్  పొందండి ఇలా....

Suma Kallamadi

 షావోమి నుంచి ఎంఐ క్రెడిట్ ప్లాట్‌పామ్‌ను లంచ్ చేయడం జరిగింది. ఎంఐ క్రెడిట్ సర్వీస్ ద్వారా సింపుల్ కేవైసీ వెరిఫికేషన్‌తో కేవలం 10 నిమిషాల్లోనే లోన్ తీసుకోవచ్చని కంపెనీ తెలియచేయడం జరిగింది. కంపెనీ అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీ ఈ లెండింగ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి దాకా ఎంఐ క్రెడిట్ సర్వీస్‌కు పెద్దగా ఆదరణ లేదని బాగా తెలుస్తుంది. అయితే రీలాంచ్ వల్ల కంపెనీ ఈ విభాగంలోనూ దూసుకెళ్లాలని భావించడం జరిగింది.

 

 

ఈ ఎంఐ క్రెడిట్ ద్వారా రూ.లక్ష వరకు రుణం పొందే అవకాశం ఉంది. 18 ఏళ్లకుపైన వయసు ఉన్న వారు అర్హులు. తీసుకున్న రుణాన్ని 91 రోజుల నుంచి 3 ఏళ్లలోపు తిరిగి చెలించవలసి వస్తుంది. వడ్డీ నెలకు 1.35 శాతంగా ఉంది. ఉదాహరణకు రూ.20,000 రుణం తీసుకుంటే వడ్డీ రేటు 16.2 శాతంగా ఉంటుంది. ఈ లోన్‌ను 6 నెలలలోగా చెలించవలసి వస్తుంది. వడ్డీ రూ.937 అవుతుంది. ఈఎంఐ  నెలకు రూ.3,423  కట్టవలసిన అవసరం ఉంటుంది. 

 

పర్సనల్ లోన్  పొందండి ఇలా .. యూజర్లు లోన్ తీసుకోవాలని భావిస్తే ఎంఐ క్రెడిట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫోన నెంబర్ సహా ఇతర కేవైసీ డాక్యుమెంట్లు కచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా యాప్‌లో  ఇవ్వాల్సి వస్తుంది. లోన్ డబ్బులు ఈ అకౌంట్‌కు వచ్చి జమ అవుతాయి.

 

 

ఇక షావోమి ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం లోన్ పొందడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎంఐ క్రెడిట్ యాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఎంఐ యూజర్లకు ఎంఐ క్రెడిట్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉండడం అందరికి తెలిసిన విషయమే కదా. ఈ యాప్ మనము  గూగుల్ ప్లేస్టోర్‌ ద్వారా  డౌన్‌లోడ్  చేసుకునే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: