సంవత్సరానికి రూ.330 చెల్లిస్తే...రూ.2 లక్షల పొందండి ఇలా....!
కేంద్ర ప్రభుత్వం ప్రజల సామాజిక ఆర్థిక భద్రత లక్ష్యంగా అనేక పతకాలను ఆఫర్ చేస్తోంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) కూడా ఇందులో ఒక భాగమే. ఇది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిపిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆఫర్ చేస్తోంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనాసరే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. జీవన్ జ్యోతి బీమా యోజన వల్ల స్కీమ్‌లో చేరిన వారికి జీవిత బీమా 55 ఏళ్ల వరకు వర్తిస్తుంది. బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారు ఈ ఇన్సూరెన్స్ పాలసీ సులువుగా తీసుకునే అవకాశం ఉంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో ఈ స్కీమ్ గురించి తెలియచేయడం జరిగింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో 5.91 కోట్ల మంది చేరారని తెలియచేయడం జరిగింది. అలాగే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 15.47 కోట్ల మంది చేరారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సామాజిక భద్రత స్కీమ్స్‌ను 2015లో ఆవిష్కరించింది. జనసురక్ష్ వెబ్‌సైట్ ప్రకారం.. జీవన్ జ్యోతి బీమా యోజన పతకంలో చేరిన వారికి రూ.2 లక్షల లైఫ్ కవర్ వస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ సదుపాయం ఉంటుంది. దీని కోసం సంవత్సరానికి ఒకసారి రూ.330 చెల్లించాలి.
ఇలా ప్రతి సంవత్సరం రూ.330 చెల్లిస్తూ రావాలి. అప్పుడు ప్రతి ఏడాది రూ.2 లక్షల కవరేజ్ లభిస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రీమియం మొత్తం ప్రతి ఏడాది అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గానే కట్ అవ్వడం జరుగుతుంది.
అందువల్ల ఈ పాలసీ తీసుకోవడం మంచిదే. పాలసీ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకుంటే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కస్టమర్లకు అందుబాటులో ఉండదు. . అలాగే అకౌంట్‌లో సరిపడినంత బ్యాలెన్స్ లేకపోతే, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ వర్తించదు అని తెలిపారు.