జియో నుంచి కొత్త డేటా వోచర్లు..! వివరాలు ఇలా..!!!
ప్రముఖ టెలికాం సంస్థ ఐనా రిలయన్స్ జియో ప్రస్తుతం జియో ఫైబర్ ప్రివ్యూ ప్లాన్ల నుంచి పెయిడ్ ప్లాన్ల వైపు పోవడాయినికి సిద్ధం అవుతుంది. ఇదే తరుణంలో కమర్షియల్ బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్ కు అవసరమ్యే అన్ని హంగులను కూడా ఇవ్వాలని ముందుకు కొనసాగుతుంది. ఇక ఇందులో భాగంగానే జియో ఫైబర్ కస్టమర్లకు డేటా వోచర్లు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జియో అందించే డేటా వోచర్లు రూ.101 నుంచి రూ.4,001 వరకు ఉండబోతున్నాయి అని ప్రకటన తెలియచేస్తుంది. డేటా వోచర్లుతో పాటు డేటా లాభాలును కూడా 20 జీబీ నుంచి 2000 జీబీ వరకు అందించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... జియో ఫైబర్ మొత్తానికి ఆరు డేటా వోచర్లను ప్రకటించడం జరిగింది. ఈ వోచర్లలో రూ.101 డేటా వోచర్ తో 20 జీబీ డేటాను ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూ.251 డేటా వోచర్ తో 55 జీబీ, రూ.501 డేటా వోచర్ తో 125 జీబీ, రూ.1,001 డేటా వోచర్ తో 275 జీబీ డేటా, రూ.2,001 డేటా వోచర్ తో 650 జీబీ డేటా, రూ.4,001 డేటా వోచర్ తో 2,000 జీబీ డేటా ఇవ్వాలి అని వోచర్లను నియమించడం జరిగింది.
ఇక అతి ముఖ్యమైన వోచర్ల వ్యాలిడిటీ వివరాలు ఇలా .. మీ ప్రస్తుత ప్లాన్ ఎప్పుడైతే డేట్ అయిపోతుందో.. అప్పుడే ఈ డేటా వోచర్లు కూడా అయిపోవడం జరుగుతుంది అని తెలిపారు. ఇలా వ్యాలిడిటీ వివరాలు ఉన్నాయి కానుక మీరు ఏదైనా డేటా వోచర్ తో రీచార్జ్ చేసుకోవాలి అని అనుకున్నప్పడు మీ వ్యాలిడిటీ ఎప్పటి వరుకు ఉంది అని? మీకు ఎంత జీబీ కావాలి అని? అన్న విషయాలు అన్ని చూసుకుని ఆ తర్వాత రీచార్జ్ చేసుకోవడం చాల మంచిది.