స్టార్ట్అప్ ఐడియా వుందా? క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెట్టుబడి పొందవచ్చు. ఎలాగో తెలుసా!!

Suma Kallamadi

ఈరోజుల్లో వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి అనేది చాలా పెద్ద సమస్య అనే చెప్పాలి. పెట్టుబడి కోసం బ్యాంకులు, వ్యక్తులు, సంస్థలు ఇలా రకరకాల దారులు వెతుకుతుంటాం. బ్యాంకు నుంచి రుణం తీసుకోవ‌డం, వెంచ‌ర్ క్యాపిలిస్ట్ లు సంప్ర‌దించ‌డం, వడ్డీకి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయడం.. ఇలా మార్గాలు చాలానే ఉన్నాయి. అయితే కొంచెం వినూత్నంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల స‌మీక‌ర‌ణం చేయ‌డం అనే పధ్ధతి వుంది. ప్ర‌స్తుతం దీనికి ఎటువంటి రెగ్యులేట‌రీ నిబంధ‌న‌లు లేవు. అయితే ప్రస్తుతం స్టార్టప్ కల్చర్ లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెట్టుబడిని సేకరించే ట్రెండ్ బాగా ఊపందుకుంది. 

 

నిజానికి క్రౌడ్ అంటే ఒక స‌మూహం అని అర్థం. క్రౌడ్ ఫండింగ్ అంటే వివిధ వ్య‌క్తుల నుంచి పెట్టుబ‌డులు లేదా విరాళాలు సేరించ‌డం కోవ కిందకు వస్తుంది. అయితే క్రౌడ్ ఫండింగ్ అనేది ప్రస్తుతం ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ కాన్సెప్ట్, లేదా బిజినెస్ మోడల్ కు నిధులు స‌మ‌కూర్చుకుంటున్నారు. ఒక వెబ్ సైట్, లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మీ కాన్సెప్ట్ ను ప్రెజెంట్ చేయాలి. అప్పుడు దానిపై ఆసక్తి ఉన్న వారు మీ కాన్సెప్ట్ లో డబ్బు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీన్నే క్రౌడ్ ఫండింగ్ అంటారు. 

 

అయితే ఈ ఫండ్స్ చిన్న మొత్తాలుగా మొదలయ్యి, పెద్ద మొత్తాలలో ఉండగలవు. రూ. 100 నుంచి రూ.10000 వరకూ మీ ఫండ్ మొత్తాన్ని పెట్టుకునే/స్వీకరించే వీలుంది. సాధార‌ణంగా క్రౌడ్ ఫండింగ్ అనేది సామాజిక కోణంలో చేసే సేవ కిందకి వ‌స్తుంది. కాబ‌ట్టి వీటిలో చేసే నిధులను పెట్టుబ‌డిలా కాకుండా, విరాళం కింద చూస్తారు. వచ్చిన విరాళాలను కార్య‌క్ర‌మం విజ‌యవంతం అయ్యేందుకు వినియోగిస్తారు. ఈ సేవా కార్య‌క్ర‌మాలు ఆరోగ్యం, విద్య‌, ఆహారం త‌దిత‌ర అంశాల‌కు చెంది ఉంటుంది. ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేపట్టే వారిని "సోష‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్" అంటారు. 

 

చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాల‌నుకునే వారికి లేదా జ‌నం నుంచి నిధులు స‌మీక‌రించి సేవాకార్య‌క్ర‌మాల‌ను చేయాల‌నుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు (ఎస్ఎమ్ఈ) స్థాపించాల‌నుకునే వారికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆన్ లైన్ లో నిధులు సేకరించేవారికి kickstarter, fundable ఇలా చాలా సంస్థలు ఆన్‌లైన్ వేదికగా సేవలు అందిస్తున్నాయి. ఈ వెబ్ సైట్స్ లో మీ ప్రాజెక్టు వివరాలు తెలుపుతూ బిజినెస్, లేదా ఏదైనా సోషల్ యాక్టివిటీకి ఫండ్ రైజ్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: