వాహనదారులకు అద్భుతమైన శుభవార్త..!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి అని మొన్న ఈ మధ్య వార్తలు వచ్చి వాహనదారులను టెన్షన్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. అలాంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి. పెట్రోల్ ధర 75 రూపాయలకు.. డీజిల్ ధర 69 రూపాయలకు చేరాయి.. పాత పెట్రోల్, డీజిల్ ధరలు వచ్చేశాయ్.
అయితే ఇక ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు తగ్గుదలతో 75.99 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 22 పైసలు తగ్గుదలతో 69.79 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.
ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 16 పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. ఇక పోతే విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మిశ్రమంగా పెరిగాయి.