ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్... 499 రూపాయలు చెల్లిస్తే 25,000 రూపాయలు..?

Reddy P Rajasekhar

ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతీ అక్సా ఇన్సూరెన్స్ తో జతకట్టి కరోనా కోసం ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు 499 రూపాయలు చెల్లించి ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎయిర్‌టెల్ భారతీ అక్సా ఇన్సూరెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీ తీసుకున్నవారు కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లో ఉంటే వారికి కంపెనీ 25,000 రూపాయలు చెల్లిస్తుంది. 
 
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తమ వినియోగదారుల కోసం గ్రూప్ హాస్పిటల్ క్యాష్ పాలసీ పేరుతో మరో పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ తీసుకున్నవారు హాస్పిటలైజేషన్ లో రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ పాలసీ తీసుకున్నవారికి 10 రోజుల పాటు నగదు చెల్లిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఈ పాలసీలకు అర్హులవుతారు. 
 
ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ పీఓఎస్ దగ్గరకు వెళ్లి ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్నవారు క్వారంటైన్ లో ఉన్న సమయంలో కరోనా నెగిటివ్ వస్తే పాలసీ మొత్తంలో సగం వస్తుంది. పాలసీ తీసుకున్నరోజు నుంచి సంవత్సరం వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎయిర్‌టెల్ ఈ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: