బ్యాంక్ బంపర్ ఆఫర్... కరోనాకు పర్సనల్ లోన్... మూడు లక్షల రూపాయల వరకు రుణం....!

Reddy P Rajasekhar

దేశంలో అతి పెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహ్యోగ్ కోవిడ్ 19 స్కీమ్ కింద తమ కస్టమర్లకు రుణాలను మంజూరు చేస్తుంది. దేశంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఈ రుణాలను అందుబాటులోకి తెచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం రుణాలను తీసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కరోనా సోకిన వారికి ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ లోన్ ను అందిస్తోంది. 
 
 
8.05 శాతం వడ్డీ రేటుతో ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ నుంచి గరిష్టంగా మూడు లక్షల రూపాయల రుణం తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఎమర్జెన్సీ ఖర్చులను అధిగమించవచ్చు. 8.05 శాతం వడ్డీతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు ఈ రుణాలను అందిస్తోంది. ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ రంగ సంస్థలలో శాశ్వత ఉద్యోగులుగా పని చేసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ బ్యాంక్ లో శాలరీ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో హోం లోన్ తీసుకున్నవారు కూడా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 36 నెలలలోగా తీసుకున్నా రుణ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: