బ్యాంకింగ్ షేర్ల దెబ్బకి లాభాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్ ...!
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ అదరగొట్టింది. మార్కెట్ లోని బెంచ్‌మార్క్ సూచీలు అన్ని పరుగులు పెట్టాయి. దీనితో నేడు భారీగా లాభపడ్డాయి. నేడు ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరుతోపాటు, కొన్ని హెవీవెయిట్ షేర్లు లాభపడటంతో మార్కెట్ కు బాగా కలిసొచ్చింది. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 1051 పాయింట్లు ర్యాలీ చేయగా, నిఫ్టీ కూడా 9300 పాయింట్ల పైకి చేరుకుంది. ముఖ్యంగా ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ఎక్స్ పైరీకి ఒక రోజు ముందు షార్ట్ కవరింగ్ కారణంగా బ్యాంకింగ్ షేర్లలో పూర్తి కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు పరుగులు పెట్టాయి. చివరకు BSE సెన్సెక్స్ 996 పాయింట్ల లాభంతో 31,605 పాయింట్ల వద్ద, NSE నిఫ్టీ 286 పాయింట్ల లాభంతో 9315 పాయింట్ల వద్ద ముగిసాయి.
ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాలను చూస్తే ... నిఫ్టీ 50లో విప్రో, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ షేర్లు బాగా లాభల పడ్డాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 14 % పైగా ర్యాలీ చేసింది. ఇక అదేసమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు బాగా నష్టపోయాయి. ఇందులో సన్ ఫార్మా 2 % నష్టపోయింది. ఇక నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లు అన్ని మిశ్రమంగా ముగిసాయి. ఇందులో నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ లు నష్టపోగా ఇక మిగతా సూచీలు అన్నీ కూడా లాభపడ్డాయి. ఇందులో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 7 % పైగా లాభపడింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 6 % పరుగులు పెట్టగా, నిఫ్టీ ఐటీ 3 %, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3 % చొప్పున లాభాల బాట పట్టాయి. ఇక అలాగే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా 7 % పైగా లాభపడింది.
ఇక అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవ్వగా, 5 పైసలు నష్టంతో 75.72 వద్ద కదులుతోంది. ఇక చివరగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు కొద్దిగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.58 % తగ్గి 35.59 డాలర్లకు చేరుకోగా, WTA క్రూడ్ ధర బ్యారెల్ కు 1.34 % క్షీణతతో 33.87 డాలర్లకు చేరుకుంది.