డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్,  గిలియడ్‌ సైన్సెస్ కీలక ఒప్పందాలు ...!

Suma Kallamadi

భారత దేశంలోనే అతిపెద్ద ఫార్మా దిగ్గజం అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అమెరికా దేశానికి సంబంధించిన ఫార్మా దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్ కీలక ఒప్పందాన్ని చేకూర్చుతుంది. ఈ రెండు దిగ్గజ కంపెనీలు కరోనా వైరస్ కట్టడికి ప్రభావవంతంగా పనిచేసే యాంటీ వైరల్ డ్రగ్‌ రెమ్‌ డెసివిర్ తయారీ మార్కెటింగ్ కు సంబంధించిన భాగస్వామి ఒప్పందాలకు సంబంధించి ఈ రెండు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.

 

ఇకపోతే గిలియడ్ తో తో నాన్ ఎక్స్‌క్లూజివ్ లైసెన్స్ ఒప్పందం పై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వారు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపోతే దీంతో భారత్ తో సహా 127 దేశాల్లో ఈ రిజిస్ట్రేషన్ తయారీ మార్కెటింగ్ చేసే వీలు వారికి కలగనుంది. ఇందుకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ గిలియడ్‌ సైన్సెస్ సాంకేతిక సహకారాన్ని అందించబోతోంది.

 

ఇకపోతే దేశవ్యాప్తంగా సిప్లా లిమిటెడ్ జూబ్లీ అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ మైలాన్ సంస్థలలో ఇప్పటికే అమెరికా సంస్థ సంబంధిత భాగస్వాములను ఎప్పుడో కుదుర్చుకుంది. అలాగే పొరుగు దేశమైన పాకిస్తాన్ లో కూడా ఫిరోజ్ డాన్స్ తో సహా మొత్తం తొమ్మిది కంపెనీలతో ఈ డ్రగ్ తయారీ ఒప్పందానికి అమెరికా కంపెనీ ముందుకు వచ్చింది.

 

 

ఈ ఒప్పందంతో మొత్తం 127 దేశాలలో పంపిణీ కోసం రెమ్‌ డెసివిర్‌ ను తయారు  చేయడానికి కంపెనీలకు అనుమతి ఉంది. అలాగే వారి ఉత్పత్తిని మరింత త్వరగా పెంచుకోవడానికి, వారి ఉత్పత్తులకు వారి సొంత ధరలను నిర్ణయించడానికి ఇందులో వెసులుబాటును కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: