నిజమవుతున్న మోడీ మేకిన్ ఇండియా కల... ఇకపై భారత్ లో తయారవ్వనున్న ఐఫోన్లు..!
ప్రపంచంలోనే ఐఫోన్లను ఎక్కువగా తయారుచేసే పెగట్రాన్ కంపెనీ దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు పెడుతూ అసెంబుల్ చేసే స్థానిక ఇండస్ట్రీలను ఏర్పాటు చేసేందుకు ముందడుగులు వేస్తుంది. దీన్నిబట్టి మన భారతీయులు ఐఫోన్ పరికరాలను అమర్చి దేశంలోని మొబైల్ మార్కెట్లలోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సంస్థలైన విస్ట్రన్, ఫోక్సన్ కంపెనీలు భారతదేశంలో తమ యాపిల్ ఫోన్లను అసెంబుల్ చేసే ఇండస్ట్రీలను ఎప్పుడో ప్రారంభించారు. ప్రస్తుతం పెగట్రాన్ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగులందరూ చైనా దేశంలోనే ఉన్నారు. కానీ అమెరికా సంస్థ అయిన యాపిల్ చైనాలో తమ ఐఫోన్ల తయారీ లను కొనసాగించేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
అందుకే యాపిల్ తయారీ కంపెనీలు భారత దేశంలో తమ ఫోన్ల కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. పెగట్రాన్ కంపెనీ తీసుకున్న నిర్ణయం వలన భారతీయులు బాగా లాభపడతారని ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫోక్సన్ కంపెనీ చెన్నైలో ఐఫోన్ ఎక్స్ఆర్ను తయారు చేస్తుండగా, విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్ 7 ను బెంగళూరులో తయారు చేస్తుంది. స్మార్ట్ఫోన్ల యొక్క దేశీయ తయారీని, అసెంబుల్ ప్రక్రియను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఫోక్సన్, విస్ట్రాన్ ఐఫోన్ సంస్థలు భారతదేశంలో స్థానిక ఉత్పత్తిని విపరీతంగా పెంచేశాయి.
నిజం చెప్పాలంటే భారత ప్రభుత్వం కేవలం అసెంబుల్ ప్రక్రియను ప్రోత్సహించడం మాత్రమే కాదు... ప్రముఖ ఫోన్ కంపెనీలను తమ మొత్తం సరఫరా కార్యకలాపాలను, యంత్రాలను భారతదేశానికి తీసుకురావాలని ఒత్తిడి చేస్తోంది. అన్ని వస్తువులు భారతదేశంలోనే తయారవుతే... ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని... ఫలితంగా భారతీయులందరూ బాగా లాభపడతారని ప్రధాన నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రఖ్యాత సంస్థలన్నీ మన భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుండడంతో మేకిన్ ఇండియా కల నిజమవుతుందని చెప్పుకోవచ్చు.