నష్టాలు చవిచూసిన మార్కెట్లు..
వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా వీచిన వ్యతిరేక పవనాలు కూడా ఇందుకు తోడయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు అయిదురోజుల లాభాలకు బ్రేక్ వేసాయి. ప్రధానమద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. ఉదయం ప్రారంభం నుంచే ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు బలహీనపడటంతో మార్కెట్ల సూచీలు క్షీణించాయి. వరుస లాభాల తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 11100 స్థాయిని కోల్పోయింది. ఆరంభంలో లాభపడినా, డే గరిష్టంనుంచి దాదాపు 490 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 303 పాయింట్లు నష్టంతో 37626 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11064 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికాతో పాటు వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి అధికమవుతుండటంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా బంగారంపై ఆసక్తి చూపించారని, ఈ పరిణామాల్లోనే మార్కెట్ల సెంటిమెంట్ బలహీనపడినట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, రిలయన్స్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి.
హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, నెస్లె, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక నష్తాలను నమోదు చేశాయి. ఫలితాల జోష్‌తో ప్రైవేటు రంగ బ్యాకు యాక్సిస్ భారీగాలా భపడుతోంది.ఇంకా పవర్ గ్రిడ్, టైటన్,ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ,రిలయన్స్ , వేదాంతా లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటో, టాటా మోటార్స్,మారుతి, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్‌టీ బీపీసీఎల్, విప్రో నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలరు మారకంలో ఒకపైసా లాభంతో 74.75 వద్ద ముగిసింది.