హోం లోన్ తీసుకోవాలనుకునే వారికి ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్... తక్కువ వడ్డీకే రుణాలు...?

Reddy P Rajasekhar

మనలో చాలామంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఎక్కడైనా తక్కువ వడ్డీకే హోం లోన్ లభిస్తే బాగుంటుందని యోచిస్తూ ఉంటారు. చేతిలో నగదు లేకపోయినా లోన్ తీసుకుని కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు ఎల్‌ఐసీ శుభవార్త చెప్పింది. హోం లోన్ పై ఆసక్తి ఉన్నవాళ్లకు తక్కువ వడ్డీకే రుణాలను అందించనుంది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు వల్ల హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గాయి. 
 
సాధారణంగా ఎక్కువ మంది హోం లోన్ కోసం దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐను ఆశ్రయిస్తూ ఉంటారు. ఎస్బీఐ 6.95 శాతం నుంచి వడ్డీ రేటుతో కస్టమర్లకు హోమ్ లోన్స్ అందిస్తోంది. అయితే ఎల్‌ఐసీ కేవలం 6.9 శాతానికే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీకే హోం లోన్స్ ఇస్తూ ఎల్‌ఐసీ ఎస్బీఐకు ఝలక్ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. 
 
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్ తీసుకోవానుకునే వాళ్లకు 50 లక్షల రూపాయల వరకు 6.9 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. అదే లోన్ అమౌంట్ రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్యలో ఉంటే వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. కోటి నుంచి మూడు కోట్ల రూపాయల మధ్యలో రుణ మొత్తానికి 7.1 శాతం వడ్డీ చెల్లించాలి. 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకోవాలనుకుంటే 7.2 శాతం వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. 
 
మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిన సంగతి తెలిసిందే. కొనుగోళ్లు తగ్గిపోవడంతో ఇళ్ల ధరలు కూడా తగ్గాయి. చేతిలో డబ్బులు ఉన్నవాళ్లు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎల్‌ఐసీ సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్నవాళ్లకు మాత్రమే రుణాలు ఇవ్వనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: