వరుస నష్టాలకు చెక్ పెడుతూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!
నేడు దేశీ స్టాక్ మార్కెట్ దుమ్ము దులిపింది. వరుసగా రెండు రోజుల నష్టాలకి నేడు చెక్ పెడుతూ లాభాల్లో ముగిసింది స్టాక్ మార్కెట్. నేడు అమెరికా నుంచి మరో పాకేజ్ ఉండవచ్చన్న అంచనా ద్వారా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. అలాగే కొన్ని కంపెనీల ఫలితాల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో పయనించాయి. ఇక నేడు మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 558 పాయింట్లు ఎగిసి 38,493 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 169 పాయింట్లు ఎగిసి 11,301 పాయింట్ల కు చేరుకుంది.
ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... టాటా మోటార్స్, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కొటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిం, అల్ట్రాటెక్ సిమెంట్, టిసిఎస్ ల షేర్లు అత్యధిక లాభాలు పొందిన లిస్టు లో మొదట గా ఉన్నాయి. ఇందులో టిసిఎస్ కంపెనీ షేరు 5 శాతం పైగా లాభపడింది. ఇక అలాగే మరో వైపు నెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, భారతి ఇన్ఫ్రా టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ షేర్లు అత్యధిక నష్టాల్లో నడిచాయి. ఐసిఐసిఐ బ్యాంక్ రెండు శాతం పైగా నష్టపోయింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూస్తే భారత రూపాయి మారక విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే... ఎటువంటి లాభ నష్టాలు లేకుండా 74.84 వద్ద కొనసాగుతోంది. ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికి వస్తే బ్రెంట్ ముడిచమురు ధర 0.09 శాతం పెరిగి 43.9 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఏ ముడి చమురు ధర 0.3 శాతం తగ్గి 41.4 డాలర్లకు చేరుకుంది.