పీఎఫ్ అకౌంట్ లో బ్యాలన్స్ చెక్ చేసుకోవాలా..? ఐతే ఇలా ఫాలో అవ్వండి..!
అయితే ఉద్యోగి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో మీ డబ్బు ఎంత మేర అకౌంట్లో వచ్చిందో లేదో తెలుసుకోవడానికి చాలా సులువైన ఆప్షన్ అందుబాటులోకి తీసుకోని వచ్చాయి. ఉద్యోగి యు ఏ ఎన్ ఆక్టివేట్ అయిన తర్వాత వారు అందించిన మొబైల్ నుండి ఒక ఎస్ఎంఎస్ ద్వారా వారి ఈపీఎఫ్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇట్లే సులువుగా తెలుసుకోవచ్చు. ఇక ఇందుకోసం ఉద్యోగి తన మొబైల్ నుండి EPFOHO అని అని టైప్ చేసి యు ఏ ఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఎల్ ఏ ఎన్ అని టైప్ చేసి 7738299899 నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపించాలి ఉంటుంది. అలాగే 011-22901406 నెంబర్ నుండి కూడా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సదరు ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయా తెలుసుకోవచ్చు.
ఇక మామూలు పద్ధతిలో ఈపీఎఫ్ ఓ వెబ్సైట్ కి వెళ్లి అక్కడ మీ యు ఏ ఎన్ మరియు యూజర్ పాస్ వర్డ్ సహాయంతో లాగిన్ అయిన తర్వాత మీ బ్యాలెన్స్ ను కంప్యూటర్ స్క్రీన్ పై చూసుకోవచ్చు. తాజాగా ఉమంగ్ ఆప్ ద్వారా కూడా మీ పిఎఫ్ అకౌంట్ లో నెట్ బ్యాలెన్స్ ను సులువుగా చెక్ చేసుకోవచ్చు.ఇందుకు సంబంధించి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే సంబంధిత డిడిఓ కు సమాచారాన్ని అందించి పరిష్కారాన్ని కనుగొనగలరు.