అదరగొట్టిన స్టాక్ మర్కెట్స్..!
నిన్నటి లాభాలు కొనసాగింపుగా నేడు కూడా దేశీయ స్టాక్ మర్కెట్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే నేటి మొదటి నుండి బాగానే లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఎక్కడ వెనక్కి చూడకుండా లాభాల వైపు పయనించాయి. ఇక నేడు మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 477 పాయింట్లు లాభపడి 38,528 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 138 పాయింట్లు బలపడి 11,385 వద్ద ముగిసింది.
ఇక నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ఏకంగా రూ. 1040 పెరిగి రూ. 56,530 వద్ద ముగిసింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 970 రూపాయలు పెరిగి రూ. 51,670 కు చేరుకుంది. ఇక బంగారం తో పాటు వెండి ధర కూడా చూస్తే... ఏకంగా ఒక్కరోజే కేజీ వెండి ధర రూ. 2200 రూపాయలు పెరిగి రూ. 71,100 వద్ద ముగిసింది.