భారీగా న‌ష్ట‌పోయిన మార్కెట్లు... వెంటాడిన దేశీయ క‌రోనా ఫ‌లితాల భ‌యం

Spyder

స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేకులు పడ్డాయి. మూడు రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బెంచ్‌మార్క్ సూచీలు గురువారం డీలా పడ్డాయి. భారీగానే నష్టపోయాయి. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా వైరస్‌ కారణంగా మందగమనం ఎదుర్కొంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం ఆసియా సహా భారత్‌ మార్కెట్లపై పడింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ఒకే రోజు ఏకంగా 70 వేల వరకు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవ్వడం, దేశీయంగానూ కరోనా కేసుల పెరుగుతుండటం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది.


 ఫెడరల్‌ రిజర్వ్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆసియాలోని మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయి. కొవిడ్-19 వల్ల ఆర్థిక రికవరీ అనిశ్చితిలో ఉందని ఫెడ్ రిజర్వ్ వెల్లడించింది. ప్రపంచ మార్కెట్ల పరిణామాలతో దేశీయ మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో వరుసగా మూడు రోజులపాటు లాభాలను నమోదు చేసిన ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ఆందోళనతో, దేశీయంగానూ కరోనా కేసుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, ఈ ఆందోళనల కారణంగానే మదుపర్లు అమ్మకాలు సిద్ధమయ్యారని మార్కెట్ నిపుణులు తెలిపారు.


ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆద్యంతం ఒడుదొడుకులకు లోనైంది. చివరికి 394 పాయింట్ల నష్టంతో 38,220.39 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్ల నష్టంతో 11,312.20 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అధికంగా క్షీనించగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో స్వల్పంగా దిగజారాయి. ఇక, మీడియా, రియల్టీ, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో కదలాడాయి. అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, టైటాన్, రిలయన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 75.02గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: