SBIలో ఉచితంగా ఈ అకౌంట్ తెరిస్తే రూ.2 లక్షల బెనిఫిట్‌..!

Suma Kallamadi
దేశంలో కరోనా వైరస్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. అయితే వారికీ అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్‌ను అందిస్తోంది. మరీముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం వచ్చి ఆరేళ్లు దాటిపోయిందని తెలిపారు. ఈ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన వారు దగ్గరిలోని బ్యాంకుకు వెళ్లి ఉచితంగానే బ్యాంక్ ఖాతా తెరవొచ్చునని నిపుణులు తెలిపారు.

ఇక దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా పలు బ్యాంకులు జన్ ధన్ అకౌంట్ సర్వీసులు అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా ఈ బ్యాంక్ అకౌంట్‌ను తెరిచిన విషయం విదితమే. పేదలు, మహిళలు, రైతులు, కార్మికులు వంటి వారు బ్యాంక్‌కు వెళ్లి జన్ ధన్ అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చునని తెలిపారు.

అయితే జన్ ధన్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చునన్నారు. అయితే ఉచితంగా ఈ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయొచ్చునన్నారు. ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదని తెలిపారు. ఇక అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందొచ్చునని వెల్లడించారు.

అంతేకాక అకౌంట్ కలిగిన వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని తెలిపారు. అలాగే రూ.30,000 జీవిత బీమా లభిస్తుంది. మీ అకౌంట్‌లోని డబ్బులకు వడ్డీ వస్తూనే ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ఉచితంగా పొందొచ్చు. రూపే డెబిట్ కార్డు కూడా ఫ్రీగానే వస్తుంది. జన్ ధన్ అకౌంట్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చునని తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్, శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకాల్లో సులభంగా చేరొచ్చునన్నారు. ఇతరులకు డబ్బులు కూడా పంపొచ్చునని తెలిపారు. మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లోకి వచ్చి చేరతాయని నిపుణులు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: