ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రం హోం ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్...!
ఇకపోతే తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకున్న ప్రకటనలో హార్డ్వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పని చేసే ఉద్యోగులు పూర్తిగా శాశ్వతంగా పని చేసేందుకు వీలు కల్పించే విధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా శాశ్వతంగా పూర్తిగా ఇంటి నుంచి పని చేయాలి అనుకున్న వారికి వారి ఉన్నత ఉద్యోగులతో చేర్చి పూర్తిగా నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగస్తులకు సూచించింది.
ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు వారి స్వస్థలం నీకు కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లిపోవడంతో ఈ ఆప్షన్ కొద్దిమేర సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధించి ఎవరైతే శాశ్వత వర్క్ ఫ్రొం హోమ్ తీసుకుంటారో వారికి వారి జీవితాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఇందుకోసం మేనేజర్ నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది.