క్రెడిట్ కార్డుకు అప్లై చేయాలనుకుంటున్నారా? ఇది ఒకసారి చూడండి..

Satvika
క్రెడిట్ కార్డులు అనేవి ఎంతగా ఉపయోగ పడుతున్నాయో చెప్పనక్కర్లేదు.. ప్రస్తుత కాలంలో అన్నం పెడుతున్నా దాతలు ఈ క్రెడిట్ కార్డ్స్.. ఎందుకంటే నెల మొత్తం వాడుకొని తర్వాత నెలలో ఈ బిల్లు కట్టుకోవడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు వస్తున్న జీతాలకు ఈ కార్డులు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే మన కష్టాలను తీరిస్తే మరి కొన్ని మాత్రం మనల్ని కష్టాల్లో కి నెట్టేస్తున్నాయి. వాటిని అప్లై చేసుకునే తప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.



క్రెడిట్ కార్డు జారీ కంపెనీలు ఏ ఏ రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఫైనాన్స్ చార్జీలు రూపంలో క్రెడిట్ కార్డు జారీ సంస్థలు మీ వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తాయి.. దీనికి అర్థం ఏంటంటే.. వాళ్ళు ఇచ్చిన మొత్తాన్ని కి వడ్డీని వేస్తారు.. ఆ వడ్డీ రేట్లు కూడా బ్యాంకు ను బట్టీ మారుతుంటాయి. వాళ్ళు ఇచ్చిన టైమ్ లోపు కట్టక పోతే 49 శాతం వరకు వడ్డీని కట్టాలి.. అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డులను వాడటం ఒకందుకు మంచిదే అయినా కుద్దా కట్టేటప్పుడు బాదుడు మాత్రం మాములుగా ఉండదు.



క్రెడిట్ కార్డుకు వార్షిక మెయింటెనెన్స్ ఫీజు కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ చార్జీ చెల్లించాలి. కొన్ని బ్యాంకులు తొలి ఏడాది మాత్రమే మెయింటెనెన్స్ చార్జీల నుంచి కస్టమర్లకు అందిస్తారు. తర్వాత నుంచి బిల్లు రేటు పూర్తిగా మారిపోతుంది.. మరో విషయమేంటంటే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు తీసుకున్నట్లయితే అధిక భారాన్ని మోపుతారు. అధిక వడ్డీని గుంజుతారు.. కార్డు లిమిట్ దాటి ఉపయోగిస్తే వేలు ఎక్స్ట్రా చెల్లించాల్సి వస్తోంది. ఎటూ చూసుకున్నా వాడేంత వరకు బాగానే ఉంటుంది.. తీరా వాడిన తర్వాత తడిసి మోపెడు అవుతుంది.. మొత్తానికి బిల్ కట్టలేక ఆస్తులు అమ్ముకోవాలని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: