అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జీవితంలో జరిగిన సంఘటనలు, రాజకీయ అనుభవాలను ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం నవంబరు 17న మార్కెట్‌లోకి విడుదల కాగా.. రికార్డుస్థాయిలో అమ్ముడవుతోంది. కేవలం 24 గంటల్లోనే 890,000 కాపీలు అమెరికా, కెనాడాలో అమ్ముడయ్యాయి. దీంతో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.