లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్న ఎస్బీఐ..
రుణాలపై ఎస్బీఐ అందిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పర్సనల్ లోన్ దగ్గరి నుంచి హోమ్ లోన్ వరకు పలు బెనిఫిట్స్ అందిస్తోంది .. స్టేట్ బ్యాంక్ తక్కువ వడ్డీకే కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అదే మీరు గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి వడ్డీ మొదలవుతుంది. లోన్ పెట్టుకొని ఏదైనా వస్తువులను, వాహనాలను, కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ బ్యాంక్ సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది.
పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్‌పై మాత్రమే కాకుండా ఎస్బీఐ హోమ్ లోన్ రుణ గ్రహీతలకు కూడా పలు ఆఫర్లు అందుబాటులో ఉంచింది. హోమ్ లోన్‌పై అతి తక్కువ వడ్డీ 6.9 శాతం కే డబ్బులను ఇస్తుంది.ఈ రుణాలన్నింటిపైనా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ లభిస్తోంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసుకుంటే ఈ ప్రయోజనం మరింతగా ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. ఈ బ్యాంక్ యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ తీసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని , వడ్డీ ఇంకాస్త తగ్గుతుందని బ్యాంక్ ప్రకటించింది. లోన్ కు సంబందించిన వడ్డీ విషయంలో ఎస్బిఐ ఎప్పుడు గ్రేట్ అనే చెప్పాలి.. మీకు లోన్ తీసుకొనే ఆలోచన ఉంటే ఈ బ్యాంకులో తీసుకోండి..