హామీ లేకుండా 10 లక్షల ఋణం పొందే అవకాశం!

SS Marvels
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పధకాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందిస్తోంది. అయితే వీటిల్లో బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే రుణ గ్రహీతలకు ఊరట కలిగించే పథకాలు కూడా ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించే వారికి ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పేరుతో ఒక స్కీమ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందిస్తోంది. ఈ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అయితే దీనికి ఎలాంటి గ్యారంటీ కూడా అవసరం లేదు. ఇక మహిళలు కూడా ఈ రుణం తీసుకోవచ్చు.

ఈ ముద్రా యోజన స్కీమ్ కింద మొత్తంగా మూడు కేటగిరిల్లో రుణం పొందే అవకాశం ఉంటుంది. 50,000 రూపాయల వరకు రుణం తీసుకోవాలంటే శిశు లోన్ కేటగిరి కిందకు వస్తారు. అలాగే 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందాలనుకునేవారు అయితే కిశోర్ కేటగిరిలో ఉంటారు. ఇక 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణం పొందాలని భావించేవారు తరుణ్ కేటగిరి కింద ఈ లోన్ మొత్తాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు మీ దగ్గరిలోని బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ వంటి సంస్థలకు వెళ్లి ఈ స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. www.udyamimitra.in ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్నా లోన్ పొందొచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: