మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...

Spyder
డబ్బు ఖర్చు చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే.. అదే మరింత డబ్బును సంపాదించి పెడుతుంది. ప్రస్తుతం చాలా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్  కూడా ఒకటి. ఇదొక రిటైర్మెంట్ స్కీమ్. ఎన్‌పీఎస్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ నిర్వహిస్తుంది. 18 నుంచి 65 ఏళ్లలోపు వయసు ఉన్న భారతీయులు ఈ పథకంలో చేరొచ్చు. స్కీమ్‌లో చేరినప్పుడు ప్రతి ఎన్‌పీఎస్ మెంబర్‌కు ఒక పోర్టబుల్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్  వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 జనవరిలో ఈ స్కీమ్ లాంచ్ అయ్యింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేశాయి.


2009 నుంచి ఈ స్కీమ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో చేరినవారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత అకౌంట్‌లోని డబ్బుల్లో 60 శాతం వెనక్కు తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యూటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. దీంతో సబ్‌స్క్రైబర్‌కు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఇన్న‌ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా అత్యుత్త‌మ‌మైంద‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప‌థ‌కంలో చేరే వారు రెండు అకౌంట్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక అకౌంట్‌పై దాదాపు 8 శాతం రాబడి పొందొచ్చు. మ‌రో అకౌంట్‌పై దాదాపు 12 శాతం రాబడి లభిస్తుందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.


ఇన్వ‌స్ట్ ప్లాన‌ర్స్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉదాహార‌ణ‌కు  నెలకు రూ.6,000 ఇన్వెస్ట్ చేుస్తే మెచ్యూరిటీ కాలంలో చేతికి ఏకంగా రూ.1.3 కోట్లు పొందే అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ.27 వేలకు పైగా పెన్షన్ మొత్తం లభిస్తుంది. అయితే మీరు 30 ఏళ్ల వయసులోనే ఈ స్కీమ్‌లో చేరాలి. ఇంకా 40 శాతం యాన్యుటీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు 30 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు మీరు ఎన్‌పీఎస్‌లో చేరానుకుందాం. నెలకు రూ.6,000 కడుతున్నారు. ఇలా మీరు 30 ఏళ్లు చెల్లించాలి. ఇలా చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు చేతికి ఒకేసారి రూ.1.27 కోట్లు లభిస్తుంద‌ని చెబుతున్నారు. ఇంకా నెలకు రూ.42 వేలకు పైగా పెన్షన్ పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: