పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!!
మరో విషయమేంటంటే.. అవసరం అయితే పెన్షనర్లు పీపీఓను ఒక్క క్లిక్‌తోనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. లాక్ డౌన్ సమయం లో పెన్షన్ తీసుకునే వారు పీపీవో గురించి ఆందోళన చెందారు. అయితే ఇకపై ఇపీపీవోలు అందుబాటు లోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లోనే పీపీవో పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్ నుంచి పీపీఓకు సంబంధించి తరుచుగా పెన్షన్ డిపార్ట్ మెంట్‌కు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు ఊరట కలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ పీపీవో వల్ల వల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలిగిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో రిటైర్ అయిన వారికి ఈ సర్వీసులు వల్ల చాలా బెనిఫిట్ కలిగిందని తెలిపారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్‌లైన్‌లోనే పీపీవో డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడం లో ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తరువాత పీ పీ వో వెంటనే తయారవుతుంది. ఇది ఉంటేనే ఉద్యోగులకు పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం పెన్షన్ పెంచితే.. అలాంటప్పుడు కూడా పీపీవో అవసరం అవుతుంది. అయితే పొరపాటున ఇది కనిపించక పోతే పెన్షనర్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పిపివో వల్ల భవిష్యత్ లో ఫెన్షన్ ను కూడా అప్డేట్ చేసుకొచ్చు.